మోదీ డిగ్రీ వివరాల కోసం ఓ ఆర్టీఐ కార్యకర్త పోరాడుతున్నారు: రాహుల్

మోదీ డిగ్రీ వివరాల కోసం ఓ ఆర్టీఐ కార్యకర్త పోరాడుతున్నారు: రాహుల్

ప్రధని నరేంద్ర మోదీ విద్యార్హతలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంఫాల్ లో ఈరోజు విద్యార్థులతో మాట్లాడుతూ మోదీ యూనివర్శిటీ చదువుకున్నానని చెబుతున్నారని… ఆయన ఏ యూనివర్శిటీలో చదువుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఏ యూనివర్శిటీకి వెళ్లారో ఎవరికీ తెలియదని అన్నారు. యూనివర్శిటీలకు వెళ్లనివారికి తాను వ్యతిరేకం కాదని… యూనివర్శిటీలకు వెళ్లనివారికి కూడా విశేష ప్రతిభాపాటవాలు ఉంటాయని చెప్పారు. మోదీ డిగ్రీపై ఢిల్లీలోని ఓ ఆర్టీఐ కార్యకర్త పోరాడుతున్నారని… ఇంతవరకు ఆయనకు ఆర్టీఐ సమాధానం చెప్పలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *