ముందస్తు అరెస్ట్‌లు.. రేవంత్, షబ్బీర్ అలీ హౌస్ అరెస్ట్

  • ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్ గృహ నిర్బంధం
  • ముట్టడికి తరలివస్తున్న జగిత్యాల, సిరిసిల్ల నేతల అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు, ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డికి గృహ నిర్బంధం విధించారు. అలాగే, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Tags: Congress, Pragathi Bhavan, TSRTC, Revanth Reddy,Shabbir Ali, house arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *