మహేశ్ బాబు ఆస్తులపై దాడులు చేయడం వెనక కారణం ఇదే: గల్లా జయదేవ్

మహేశ్ బాబు ఆస్తులపై దాడులు చేయడం వెనక కారణం ఇదే: గల్లా జయదేవ్

‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అన్నందుకు ఈడీ దాడులతో భయపెట్టాలని చూశారు
నేను భయపడకపోవడంతో… మహేశ్ ఆస్తులపై దాడి చేశారు
ఇలాంటి వాటికి మా కుటుంబసభ్యులు భయపడరు
పార్లమెంటులో తాను మాట్లాడుతూ ప్రధానిని ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అన్నందుకు తనను ఈడీ దాడులతో భయపెట్టాలని చూశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాను భయపడకపోవడంతో హైదరాబాదులో ఉన్న మహేశ్ బాబు ఆస్తులపై దాడులు చేశారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు తానే కాదు, తన కుటుంబసభ్యులు కూడా భయపడరని చెప్పారు.

ఎన్నికలకు ఎంతో సమయం లేదని… ఈ వారం రోజులు ఎంతో కీలకమైనవని గల్లా జయదేవ్ టీడీపీ కార్యకర్తలకు గుర్తు చేశారు. ఇతర పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగవద్దని విన్నవించారు. రూ. 16వేల లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోతే… రేయింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తెచ్చారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *