మరోమారు దొరికిపోయిన ట్రంప్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు దొరికిపోయారు. జమాత్ ఉద్ దవా చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను రెండు రోజుల క్రితం పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. సయీద్ అరెస్ట్‌పై ట్రంప్ స్పందించారు. పాకిస్థాన్ పదేళ్ల పాటు గాలించి ఎట్టకేలకు హఫీజ్ సయీద్‌ అరెస్ట్ చేసిందని ట్రంప్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా పాక్ అతడిపై ఒత్తిడి విపరీతంగా పెంచిందని ప్రశంసించారు.

ట్రంప్ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు ఆటాడుకున్నారు. అయ్యా ట్రంప్ గారూ.. హఫీజ్ కోసం ఎవరూ గాలించలేదయ్యా.. అతడు పాకిస్థాన్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.. అంటూ సెటైర్లు వేశారు. కామెంట్లతో హోరెత్తించారు. దీంతో అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. హఫీజ్ కోసం పాకిస్థాన్ గత పదేళ్లుగా ఏమీ వెతకలేదని, పాక్‌లో అతడు స్వేచ్ఛగానే ఉన్నాడని పేర్కొంది. పలుమార్లు అరెస్టై బయటకు వచ్చాడని తెలిపింది. డిసెంబరు 2001, మే 2002, అక్టోబర్ 2002, ఆగస్టు 2006(రెండుసార్లు), డిసెంబరు 2008, సెప్టెంబరు 2009, జనవరి 2017లలో కూడా హఫీజ్ అరెస్ట్ అయినా ఆ వెంటనే బయటకు వచ్చాడని వివరించింది. తాజాగా అతడిని అరెస్ట్ చేసిన పాక్.. సయీద్ దోషిగా తేలేంత వరకు విడిచిపెట్టొద్దని కోరింది.
Tags: Donald Trump,America,Hafiz Saeed,Pakistan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *