మరొక సంచలనానికి తెరలేపిన యోగి ఆదిత్యనాథ్…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరొక సంచలనానికి తెరలేపాడు… తాను అధికారంలోకి వచ్చినప్పటినుండి ఎన్నో సంచలనాలకు తెరతీసిన యోగి మరొక కొత్త పద్దతితో ముందుకు వచ్చాడు… ఇదివరకు ఎన్నికల్లో గెలిచినా నాయకులందరూ కూడా తమ వాళ్ళను, కుటుంబసభ్యులను, బంధువులను రాజకీయాల్లోకి తీసుకరావాలని ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా అధికార పార్టీ తరపున గెలిపించుకోవాలని అందరు భావిస్తుంటారు… అందుకోసమని వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అలంటి నేతలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీకి చెందిన నేతల బంధువులకు బీజేపీ తరపున టిక్కెట్లను ఇవ్వబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. అంటే ఇదివరకు ఉన్నవారికి కాకుండా మరికొందరికి కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంది కానీ వారి తరపున బంధువులెవ్వరికి కూడా ఇవ్వబోమని చెప్పేశారు… రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీని ఎలా సిద్ధం చేయాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాలు ముమ్మరం చేస్తుంది.

అంతేకాకుండా కేవలం పార్టీ కోసం నిజంగా శ్రమించే కార్యకర్తలకే టిక్కెట్ ఇవ్వాలని, అంతేకాని ఇదివరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారి తరపున బంధువుల వారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వబోమని తేల్చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంధుప్రీతిని ప్రోత్సహించబోమని ఆయన తెలిపారు. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఈ ఉప ఎన్నికల్లో తమ బంధు వర్గానికి టిక్కెట్లు కేటాయించమని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *