'మజిలీ' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

‘మజిలీ’ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

నాగచైతన్య కథానాయకుడిగా .. సమంత కథానాయికగా ‘మజిలీ’ సినిమా నిర్మితమైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. “వన్ బాయ్ .. వన్ గర్ల్ లుకింగు .. హైటు .. వెయిటు చెకింగు .. పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగు .. డౌరీ గివింగ్ .. మ్యారేజ్ బెల్సు రింగింగు .. సింగులు బెడ్డూ షేరింగు .. ఇన్ సైడ్ ఫస్టు లవ్ కిల్లింగు .. యూఆర్ డైయింగు .. ” అంటూ హీరో వైపు నుంచి ఈ పాట సాగుతోంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి పట్ల హీరో తన మనసులోని మాటను .. పాటగా స్నేహితులతో పంచుకునే సందర్భం ఇది. గోపీసుందర్ సంగీతం .. భాస్కర భట్ల సాహిత్యం .. రేవంత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేసిన ఫస్టు మూవీ కావడంతో భారీ అంచనాలు వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *