'భారతీయుడు 2' షూటింగ్ ఆగిపోలేదు: కమల్

‘భారతీయుడు 2’ షూటింగ్ ఆగిపోలేదు: కమల్

కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి వృద్ధుడి గెటప్ లోని కమల్ పోస్టర్లు కూడా బయటికి వచ్చాయి. ఆ తరువాత కమల్ లుక్ అనుకున్నట్టుగా రాలేదనే అసంతృప్తితో శంకర్ ఉన్నాడనీ, ఈ కారణంగానే ఆయన షూటింగును ఆపేశాడనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయాన్ని గురించి కమల్ స్పందించారు. ‘భారతీయుడు 2′ షూటింగు ఆగిపోయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో నేను చేస్తోన్న వృద్ధుడి పాత్రకి సంబంధించిన మేకప్ చక్కగా కుదిరింది .. ఈ విషయంలో శంకర్ పూర్తి క్లారిటీతో వున్నాడు. అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తోంది’ అంటూ స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఆయన జోడీగా కాజల్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *