బుల్లితెర షో 'జబర్దస్త్‌'కి రోజా టాటా!

బుల్లితెర షో ‘జబర్దస్త్‌’కి రోజా టాటా!

  • వచ్చే వారం ప్రోమోలో కనిపించని రోజా
  • పార్టీ వ్యవహారాల్లో బిజీ కావడమే కారణం
  • నాగబాబుతో జడ్జి స్థానాన్ని పంచుకోనున్న శేఖర్ మాస్టర్

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో ‘జబర్దస్త్’కు రోజా టాటా చెప్పేశారు. గురు, శుక్రవారాల్లో ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ షోకు నటుడు నాగబాబుతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరించేవారు. అయితే, నగరి ఎమ్మెల్యేగా పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి విజయం సాధించిన రోజా.. ఆ తర్వాత కామెడీ షోకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ తర్వాత కూడా ఆమె జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కడంతో బిజీ అయిపోయారు. ఓ వైపు ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు జబర్దస్త్ షోలో కనిపిస్తుండడంతో రోజాపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

జబర్దస్త్‌ షో వచ్చే వారానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో జడ్జి స్థానంలో రోజా కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. రోజా బదులు ‘ఢీ’ షో జడ్జ్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శనమివ్వడంతో జబర్దస్త్‌కు రోజా గుడ్ బై చెప్పేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఒక్క వారానికేనా? లేక షో మొత్తానికా అన్నది మాత్రం తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *