బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కి హోస్ట్‌గా ఎన్టీఆర్..‌?

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కి హోస్ట్‌గా ఎన్టీఆర్..‌?

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కి హోస్ట్‌గా ఎన్టీఆర్‌ కోసమే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. రెండవ సీజన్‌ అలా జనాల చేతుల్లోకి పోయి విజేత ఎవరనేది మూడవ వారంలోనే తేలిపోవడంతో ఈసారి అలాంటివి జరగకుండా డామినేటింగ్‌ పర్సనాలిటీ అయిన తారక్‌ వుండాలని స్టార్‌ మా భావిస్తోంది. అతను ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో బిజీగా వున్నా కానీ ఎలాగయినా రాజమౌళిని ఒప్పించి ఈ సీజన్‌ని నడిపించాలని చూస్తోంది. తారక్‌ హోస్ట్‌ చేసేదీ లేనిదీ ఇంకా తేలలేదు కానీ అతను హోస్ట్‌ చేయాలంటే మాత్రం పార్టిసిపెంట్స్‌ లిస్ట్‌ చాలా బాగుండాలనే కండిషన్‌ పెట్టారట. లాస్ట్‌ టైమ్‌ బయట ఫ్రెండ్స్‌ అయిన వారిని తీసుకోవడంతో వారంతా గ్రూపులు కట్టి సీజన్‌ మొత్తాన్ని భ్రష్టు పట్టించారు.

అలాగే ఎవరిని పడితే వారిని తీసుకొచ్చేయకుండా, ఆ ఆటకి తగిన వాళ్లని తీసుకురావాలని, అటు గ్లామర్‌తో పాటు ఇటు వైవిధ్యమైన పర్సనాలిటీస్‌ వున్న వారిని ఎంపిక చేయాలని, టీవీ, సినిమా అనే కాకుండా వివిధ రంగాలకి చెందిన వారిని ఆటలో భాగం చేయాలని చాలా కండిషన్లే పెట్టారట. అసలు ఎన్టీఆర్‌కి కుదురుతుందా లేదా అనేది తర్వాత తేలినా కానీ ముందయితే పార్టిసిపెంట్స్‌ ఎవరనే లిస్ట్‌ అతని చేతిలో పెట్టాలట. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసేదీ లేనిదీ ఆ లిస్ట్‌పై కూడా డిపెండ్‌ అవుతుందన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *