ప్రయోగాత్మక చిత్రంలో కాజల్

* గత సంవత్సరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఆ..’ చిత్రంలో నటించిన కథానాయిక కాజల్ అగర్వాల్ మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ప్రశాంత్ వర్మ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో కాజల్ ను ఓ కీలక పాత్రకు ఎంచుకున్నట్టు సమాచారం.
* విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించి దూసుకుపోతోంది. కాగా, ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నాడు. ఇందుకు గాను ఆయన 6.2 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
* తమిళ కథానాయకుడు ధనుశ్ తాజాగా నటిస్తున్న చిత్రం పేరు ‘పటాస్’. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా డబుల్ రోల్స్ చేస్తున్నాడు. ఇక తండ్రి సరసన స్నేహ, కొడుకు సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారట.

Tags: Kajal Agarwal, Prashanth Varma, Vijay Devarakonda, Sneha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *