ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది: శరద్ పవార్

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సంక్షోభం చివరకు రాష్ట్రపతి పాలనకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. శివసేనకు పూర్థి స్థాయిలో సీఎం పదవి… ఎన్సీపీ, కాంగ్రెస్ లకు చెరో 14 మంత్రి పదవులతో పాటు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
Tags: Sharad Pawar, NCP, Maharashtra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *