‘నేను నిస్సహాయుడిని.. నామాట వినేవారేరీ?’: మాజీ సీఎం విచారం!

నేనేమైనా ముఖ్యమంత్రినా… నా మాట వినేవారు ఎవ్వరూ…. నేను నిస్సహాయుడినేనని… మాజీ సీఎం సిద్దరామయ్య వాపోయారు. విజయపుర జిల్లా ఆల్మట్టిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైత్రి ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా లేవన్నారు. వాటిని సర్దుబాటు చేసే సత్తా నాకు లేదని విచారం వ్యక్తం చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేవాడినని అందుకు అనుగుణంగా చర్యలు ఉండేవన్నారు.

ప్రస్తుతం నేను సమన్వయ కమిటీ చైర్మన్‌ మాత్రమేనన్నారు. నేను చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. నేను సీఎంగా కొత్త తాలూకాలు ప్రకటించాను, వాటికి సంబంధించిన ప్రగతే లేదన్నారు. కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని, తహసీల్దార్‌లను నియ మించలేదని దీనికి అర్థం నా ఆదేశాలకు విలువ లేనట్టే కదా.. అన్నారు. సమన్వయ కమిటీ చైర్మన్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నానని అంతకుమించి నాకు ఎటువంటి అధికారాలు లేవన్నారు.

బాదామి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని అయితే లోక్‌సభ ఎన్నికల్లో బాగల్కోటె అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ వచ్చిందని దీన్ని బట్టి నేను ఏం చేసే పరిస్థితుల్లో లేనన్నారు. అంతకుముందు ఆయన కూడలసంగమ బసవణ్ణ ఐక్య మంటపా న్ని సందర్శించారు. ఐక్యమంటపంలో గోడ లు, ఆధార స్తంభాలలో చీలికలు ఉండడంపై విచా రం వ్యక్తం చేశారు. సీఎంతో చర్చించి మరమ్మత్తులకు సూచి స్తానన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు ఉమాశ్రీ, హెచ్‌వై.మేటితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *