నేడు ఢిల్లీకి జగన్ – ప్రత్యేక హోదా కోసమేనా…?

నేడు ఢిల్లీకి జగన్ – ప్రత్యేక హోదా కోసమేనా…?

అప్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలుసుకోనున్నారు జగన్. జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఏపీ కి సంబందించిన అభివృద్ధి పనుల కోసం చర్చలు జరపనున్నారని సమాచారం. అంతేకాకుండా శనివారం ప్రధాని నాయకత్వంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్‌తో ముడిపడి ఉందనే సంగతి తెలిసిందే. కాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో దాని ఆవశ్యకతను వివరించడానికి సీఎం జగన్ ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా శనివారం నిర్వహించే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ జగన్ పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించనున్నారు. ఈనెల 17న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిసిందే.

ఇలాగేనా కేంద్రంతో చర్చలు జరిపి ఏపీలో ప్రత్యేక హోదా తీసుకరాడానికి జగన్ తనవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నాడు కాగా ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సహకరిస్తాడని జగన్ అభిప్రాయపడుతున్నాడని సమాచారం. అయితే ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు, జగన్ తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోడీని హాజరు కావాల్సిందిగా కోరడనైకి ఢిల్లీ వెళ్లిన జగన్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు. అయితే మోడీ ప్రమాణస్వీకారానికి జగన్ హాజరు కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వలన హాజరు కాలేకపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *