నేటి సమీక్షలను కేన్సిల్ చేసిన జగన్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేటి తన సమీక్షలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి వ్యవసాయ శాఖపై అధికారులతో నేడు సమీక్ష జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఈ సీజన్ లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితరాలపై అధికారులను వివరాలు అడగాలని జగన్ భావించారు.

అయితే, నిన్న నెలవంక కనిపించడం, నేడు రంజాన్ పర్వదినం కావడంతో ఈ సమీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే జగన్ ప్రభుత్వ అధికారులతో వరుస భేటీలు, సమీక్షలు జరుపుతూ రాష్ట్ర పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *