నీ అనుభవం తగలెయ్య… జోన్ ఆదాయం రాష్ట్రానికి రావడమేంటి?

వాల్తేరు డివిజన్ ను వేరు చేస్తూ, విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించడం వల్ల దాదాపు రూ. 6 వేల కోట్ల సరకు రవాణా ఆదాయం పోయి, కేవలం రూ. 500 కోట్ల ప్రయాణికుల ఆదాయం మాత్రమే రానుందని ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలకు దిగారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, రైల్వే జోన్ ఆదాయం ఏ లెక్కలో రాష్ట్రానికి వస్తుందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

“స్టిక్కర్ బాబు, నీ అనుభవం తగలెయ్య… ఏమి ఆశించి ఇంత నీచనికి దిగజారి మాట్లాడుతున్నావ్? జోన్ ఆదాయం రాష్ట్రానికి ఎలా వస్తోందో బహిరంగ చర్చకు వస్తావా? నువ్వు గోబెల్స్ కి మనవడివి… దుష్ప్రచారానికి కవలవి… అబద్ధానికి అన్నవి… నిజానికి శత్రువువి… ద్రోహానికి వారసుడివి… తూ నీ బతుకు చెడా” అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *