నివేదికలతో రండి.. మనసు విప్పి చెప్పండి.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ నుంచి ఆహ్వానం

నివేదికలతో రండి.. మనసు విప్పి చెప్పండి.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ నుంచి ఆహ్వానం

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు సమీక్షలు నిర్వహించని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సమీక్షలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులకు ‘మాట్లాడుకుందాం రండి’ అంటూ పవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అందుబాటులో ఉన్న నివేదికలతో రావాలని అందులో పేర్కొన్నారు.

తాజా ఎన్నికల్లో ఓటమి, జనసేన సాధించిన ఓట్లు, బలాబలాలపై నేటి నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభ్యర్థులతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. కొవ్వూరు, గోపాలపురం నియోజక వర్గాల నుంచి బీఎస్పీ, ఉండి నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులు, 12 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థులను మాత్రమే సమీక్షకు పిలవడం గమనార్హం.

జనసేన నిర్వహించనున్న సమీక్షలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? పోటీ కోసం ఎలాంటి వాతావరణాన్ని పార్టీలో కల్పించాలి? అన్నదానిపై పార్టీ నేతలకు పవన్ ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *