నామినేటెడ్ పదవులపై జగన్ సంచలన నిర్ణయం..!

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ అధికారాన్ని చేపట్టిన నెల రోజులకే పాలనలో సరికొత్త మార్పులు తీసుకురావడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికితీస్తున్నాడు. అయితే జగన్ ఇప్పటికే మంత్రివర్గాన్ని ప్రకటించినా కూడా పాలన కాస్త నెమ్మదిగానే కొనసాగుతుందనే చెప్పాలి. అయితే పాలనను మరింత వేగవంతం చేయాలంటే ప్రస్తుతం ఉన్న నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పటికే కొన్ని పదవులను భర్తీ చేసినా, మరి కొన్ని పదవులకు కొందరి పేర్లను పరిశీలిస్తున్నారట. అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని, సీఆర్డీయే ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇది వరకే ప్రకటించారు. అయితే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసి రెడ్డి పద్మను, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మోహన్‌బాబు, కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా గ్రంధి శ్రీనివాస్, ఆర్టీసీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా యేసుర‌త్నం, బ్రాహ్మణ కార్పొరేష‌న్ ఛైర్మన్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మన్‌గా మోషేన్ రాజు, రాయ‌ల‌సీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి పేర్లను పరిశీలించినట్టు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
Tags: naminated, ys jagan monah reddy, ysrcp party, naminated posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *