నాని కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం?

ప్రస్తుతం నాని ‘జెర్సీ’ సినిమా పనులతో బిజీగా వున్నాడు. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, క్రికెటర్ గా నాని కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో విక్రమ్ కుమార్ బిజీగా వున్నాడు.

ఈ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ సిద్ధం చేసిన కథకి తగిన విధంగా భారీ తారాగణం .. సాంకేతిక వర్గం ఎంపిక కారణంగా ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ హక్కులను దృష్టిలో పెట్టుకుని, ఆ మొత్తం బడ్జెట్ కి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నాని కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *