నయన్ తమిళ హిట్ మూవీ తెలుగులోకి

తమిళంలో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రితం ఏడాది ఆమెకి విజయాన్ని అందించిన చిత్రాలలో ‘ఇమైక్కా నోడిగళ్’ ఒకటి. నటిగా ఈ సినిమా నయనతారను మరో మెట్టు పైకి ఎక్కించింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి ‘అంజలి .. సీబీఐ ఆఫీసర్’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా కథను నడిపించే కీలకమైన పాత్రలో నయనతార కనిపిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ కథలో నయనతార నటనకి తమిళ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అధర్వమురళి .. రాశి ఖన్నా జంటగా కనిపించనున్నారు. తెలుగులో నయనతారకి .. రాశి ఖన్నాకి మంచి క్రేజ్ వుంది గనుక, ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *