మరోమారు రెచ్చిపోయిన బాలయ్య.. నరికి పోగులు పెడతానంటూ వీడియో జర్నలిస్టు‌పై చేయిచేసుకున్న వైనం!

నడిరోడ్డుపై యువకుడిని వెంబడించి కొట్టిన బాలకృష్ణ.. వీడియో వైరల్

ఇటీవల ఓ జర్నలిస్టుపై నోరు పారేసుకున్న బాలయ్య
చీపురుపల్లిలో బాలకృష్ణ ప్రచారం..
అభిమాని ప్రవర్తనపై అనుమానాలు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ టీవీ చానల్ ప్రతినిధిని చంపేస్తానని బెదిరించిన ఆయన తాజాగా ఓ అభిమానిని నడిరోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ వీడియోను పోస్టు చేసింది.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అక్కడి టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బాలయ్య.. ఓ యువకుడిపై దాడి చేస్తుండగా చిత్రీకరించిన వీడియో ఇది. అభిమానిని పరిగెత్తించిన బాలకృష్ణ అతడిని పట్టుకుని కొట్టడం కనిపిస్తోంది. అయితే, బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకోవడానికి ముందు ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ వెంటపడి మరీ కొట్టాల్సినంత పెద్ద తప్పు అతడు ఏం చేశాడన్నది తెలియరాలేదు. కాగా, ఈ వీడియో కొంత అస్పష్టంగా ఉండడంతో బాలయ్యను పోలిన వ్యక్తి అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *