దొంగ సర్వేతో బొక్కబోర్లా పడ్డాడు... సిగ్గు లేని జన్మ: విజయసాయిరెడ్డి

దొంగ సర్వేతో బొక్కబోర్లా పడ్డాడు… సిగ్గు లేని జన్మ: విజయసాయిరెడ్డి

టీడీపీ ఘనవిజయమంటూ సర్వే
తప్పని తేలడంతో విజయసాయి సెటైర్లు
ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ
రెండు రోజుల క్రితం లోక్ నీతి సీఎస్డీఎస్ సర్వేలో ఏపీలో తెలుగుదేశం పార్టీ 120కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలినట్టు ఓ దినపత్రికలో వచ్చిన వార్త అవాస్తవమని తేలడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికే మొగ్గు అంటూ లగడపాటితో కలిసి మస్కా కొట్టబోతే చెంప చెళ్ళుమనే తీర్పు ఇచ్చారు జనం. ఆ వాతలింకా మాననే లేదు. మళ్ళీ ‘మా బాబుకే పట్టాభిషేకం’ అంటూ అదే ఆస్థాన ‘జ్యోతి’ష్యుడు ఓ దొంగ సర్వేతో ఆంధ్రుల కళ్ళు కప్పబోయి బొక్కబోర్లా పడ్డాడు. సిగ్గు లేని జన్మ!” అని ట్వీట్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *