'దేవ్' రంగంలోకి దిగిపోతున్నాడు

‘దేవ్’ రంగంలోకి దిగిపోతున్నాడు

కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ ‘దేవ్’ సినిమాను రూపొందించాడు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ యు సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. కొత్త కాన్సెప్ట్ తో రజత్ రవిశంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ – అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీ – రకుల్ కి మంచి క్రేజ్ వుంది. ఇంతకుముందు ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ సినిమా తెలుగులోను విజయాన్ని అందుకుంది. అందువలన ‘దేవ్’ కూడా సక్సెస్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *