'థూ...' అనే కేసీఆర్ తిట్లకు చంద్రబాబు అర్హుడే: కన్నా లక్ష్మీనారాయణ

‘థూ…’ అనే కేసీఆర్ తిట్లకు చంద్రబాబు అర్హుడే: కన్నా లక్ష్మీనారాయణ

కేసీఆర్ తిట్టడంలో తప్పు లేదు
లోకేశ్ పిచ్చి సలహా ఇస్తే నీ అనుభవం ఏమైంది?
బీసీ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టే తిట్లకు చంద్రబాబునాయుడు అర్హుడేనని, ఆయనలా తిట్టడంలో తప్పేమీ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. చిన్న పిల్లాడైన నారా లోకేశ్, ఏదో పిచ్చి సలహా ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీని అవమానించాలని చెబితే, చంద్రబాబుకు ఉన్న 40 సంవత్సరాల అనుభవం ఏమైపోయిందని ప్రశ్నించారు.

“ఒక బీసీ ప్రధానికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? నిన్ను “థు మీ బతుకు చెడ” అని తెలంగాణ సీఎం తిట్టడంలో తప్పే లేదు.. ఆ తిట్టుకి నువ్వు అర్హుడివి” అని కామెంట్ పెట్టారు.

అంతకుముందు మరో ట్వీట్ పెడుతూ, “స్టిక్కర్ బాబు, మోదీ గారిని చాయ్ కప్పుల పేరుతో అవమానించడం నీ ‘నిక్కర్’ కొడుకు నారా లోకేశ్ ఐడియానా? నీ లాగా 2 ఎకరాల నుండి మొదలై 2000 కోట్లు దోచేస్తే తప్పుకానీ, కష్టపడి పని చేసి మోదీ గారు ప్రధాని ఐతే తప్పేముంది? చంద్రబాబూ… నువ్వు తెలుగు వారి పరువు తీస్తున్నావు” అని విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *