త్రివిక్రమ్ .. బన్నీ మూవీ టైటిల్ దాదాపు ఖరారైపోయినట్టే

త్రివిక్రమ్ .. బన్నీ మూవీ టైటిల్ దాదాపు ఖరారైపోయినట్టే

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ భారీ విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తరహాలోనే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో నడుస్తుందట. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తండ్రి పాత్ర చాలా తక్కువసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది. అలా కాకుండా తాజా సినిమాలో సినిమా పూర్తయ్యేవరకూ తండ్రి పాత్ర రన్ అవుతూ ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాకి ‘నాన్న .. నేను’ అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని త్రివిక్రమ్ వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్ కి రప్పించే అంశాలను త్రివిక్రమ్ జోడిస్తున్నట్టుగా చెబుతున్నారు. కథానాయికలుగా పూజా హెగ్డే .. కేథరిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *