తేడా: వైఎస్ హుందాతనం.. బాబు అసహనం!

తేడా: వైఎస్ హుందాతనం.. బాబు అసహనం!

ప్రస్తుత ఏపీ డీజీపీ మీదకు రానేలేదు. ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదు.

ఇప్పటి వరకూ డీజీపీ జోలికి రాలేదు. కొంతమంది దిగువస్థాయి అధికారులను మాత్రమే బదిలీ చేశారు. ఈమాత్రం దానికే పచ్చగగ్గోలు మామూలుగా లేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు లోబడాల్సిన అధికారులు కూడా ఈ విషయంలోమాట్లాడేవాళ్లు అయ్యారు!

మరి ఇదే సమయంలో గుర్తు చేయాల్సిన విషయం ఒకటి ఉంది. అదే 2009 ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నది. ఆ సమయంలో ఏపీ డీజీపీగా ఉన్న యాదవ్ ను నాటి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆ విధుల నుంచి తప్పించారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాడు చేసిన కంప్లైంట్ ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

ఆ ఆజ్ఞలకు శిరసావహించింది నాటి వైఎస్ ప్రభుత్వం. కేంద్రంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉండిందీ కాంగ్రెస్ గవర్నమెంటే. అయితే అప్పుడు డీజీపీ బదిలీ విషయంలో ఎవరూ కూడా నోరు మెదిపిందే లేదు. సీఈసీ ఆదేశాల మేరకు నడుచుకున్నారు. అదీ ప్రభుత్వం అంటే.

ఇప్పుడూ చూస్తున్నాం.. చంద్రబాబు నాయుడు చెంచాలు వాళ్లు.. అని విమర్శలను ఎదుర్కొంటున్న వాళ్లపై ఈసీ చర్యలు తీసుకుంటే.. వీళ్లు చాలా తీవ్రమైన అసహనం వ్యక్తంచేస్తూ ఉన్నారు. మరీ ఇంత భయమెందుకు? ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హుందగా వ్యవహరించలేకపోతోంది?

నాడు డీజీపీ బదిలీ మీద వైఎస్ ప్రభుత్వం ఎంత హుందాగా స్పందించిన సంగతిని గుర్తు చేస్తోంది చంద్రబాబు నాయుడి అసహనం. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలా రియాక్ట్ అవుతున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *