తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ‘బతుకమ్మ’
ఈ పండగను ఘనంగా నిర్వహించుకోవాలి
ఆలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలి
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండగ అని, ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ పండగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. బతుకమ్మ పండగ కోసం ఆలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tags: Telangana Cm, Kcr Batukamma, Festival

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *