Tirumala, Tirupati, Lorry Accident

తిరుమల ఆలయం ముందు ఘోరం…

శ్రీవారి ఆలయం ముందే ఘటన
వేగంగా దూసుకొచ్చిన లారీ
డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయానికి పాలను తీసుకు వస్తున్న లారీ వేగంగా రావడంతో, ఓ భక్తుడు దాని కిందపడి దుర్మరణం చెందాడు. అనుకోని ఈ దుర్ఘటనతో అక్కడే ఉన్న భక్తుల్లో ఆందోళన కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన వ్యక్తితో మరెవరూ లేకపోవడంతో అతను ఎవరన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.
Tags: Tirumala, Tirupati, Lorry Accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *