టీడీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు...రేపు విడుదల చేయనున్న చంద్రబాబు

టీడీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు…రేపు విడుదల చేయనున్న చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు రూపొందించిన పార్టీ మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటి వరకు ఏం చేశారు, మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారు, అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, కార్యాచరణ వివరాలన్నింటినీ ఇందులో పొందుపర్చనున్నారు.

ఇందుకు సంబంధించి మేనిఫెస్టో కమిటీ తుదిమెరుగు దిద్దడంలో బిజీగా ఉంది. ఈరోజు మరోసారి కమిటీ సమావేశమై తుది నిర్ణయాలు తీసుకున్న అనంతరం పార్టీ అధ్యక్షుడికి మేనిఫెస్టోను సమర్పిస్తుంది. దాన్ని చంద్రబాబు రేపు విడుదల చేస్తారు.
Tags: tdp manifesto, chandra babu naidu, elections 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *