టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయంలో లంచావతారాలు..

బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని మోసం
భక్తుల నుంచి రూ.24 వేలు వసూలు
చర్యలు తీసుకోవాలని చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశం
ప్రొటోకాల్ దర్శనం పేరుతో టీటీడీ చైర్మన్ కార్యాలయ సిబ్బంది ఇద్దరు భక్తులను మోసం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం రెండు టికెట్లు ఇస్తామని రూ.24 వేలు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు శుక్రవారం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

కార్యాలయ సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయడం నిజమేనని విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారు ఆ విషయాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది అవినీతి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుబ్బారెడ్డి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. వారిని బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *