టిక్‌ టాక్‌ను నిషేధించే యోచనలో పలు రాష్ట్రాలు.. జాబితాలో తెలంగాణ కూడా!

దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్‌ టాక్‌ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే యోచన చేస్తున్నాయి. ఏడు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లగా, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యువతను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ సామాజిక మాధ్యమం వేదిక కారణంగా ఇప్పటికే చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పనులు పక్కన పెట్టి ఈ యాప్‌తో ఎక్కువ మంది కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

నిత్యం అందుతున్న వందలాది ఫిర్యాదులపై పలు రాష్ట్రాలు దృష్టిసారించాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్‌ల నిర్వాహకులకు జారీ చేసినట్లు సమాచారం.  ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో కేంద్రం హెచ్చరించింది. మరోవైపు టిక్‌ టాక్‌, హలో యాప్‌ నిర్వాహకులు ఇండియాలో వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *