బట్టతల ఉన్న వారికి జుట్టు తెప్పిస్తానన్న మోదీ!: తేజస్వీ యాదవ్ సెటైర్లు

జయరాం కేసులోకి ఎంటరైన నిర్మాత.. శిఖా చౌదరిని తప్పించేందుకేనా?

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిరుగుపాటి జయరాం (55) హత్య కేసు సూత్రధారి శిఖా చౌదరిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. సినీ నిర్మాత కేపీ చౌదరి ఈ కేసులోకి ఎంటర్ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
శుక్రవారం రాత్రి నందిగామలో శిఖా చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శిఖాను ఈ కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశ చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శిఖా కోసం స్టేషన్‌కు వచ్చిన సినీ నిర్మాత కేపీ చౌదరి ఆమె కారును తీసుకెళ్లడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమెను తప్పించేందుకే ఆయన సీన్‌లోకి ఎంటరైనట్టు చెబుతున్నారు. కాగా, అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. జయరాం భార్య వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
డాక్యుమెంట్ల కోసం యువతిని ఎరవేశా.. వాటికోసం జయరాం ఇంటికెళ్లా: శిఖా చౌదరి
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు విచారిస్తున్న కొద్దీ మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ల కోసం జయరాంకు అమ్మాయిని ఎరవేసిన మాట వాస్తవమేనని, వాటి కోసం ఆయన ఇంటికి వెళ్లిన విషయం కూడా నిజమేనని శిఖా చౌదరి పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, జయరాం చనిపోయిన రోజున మాత్రం తాను శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్ డ్రైవ్‌లో ఉన్నట్టు పోలీసులకు చెప్పింది.
మామయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడని తన తల్లి చెబితేనే ఆ విషయం తనకు తెలిసిందని పేర్కొంది. తన పేరున పది ఎకరాల భూమిని కొన్న జయరాం వాటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని తెలిపింది. జయరాంను తాను చంపలేదని, కాకపోతే అమ్మాయిని ఎరగా వేయడం మాత్రం నిజమేనని అంగీకరించింది. తన పేరున కొన్న భూమి డాక్యుమెంట్ల కోసమే వారి ఇంటికి వెళ్లానని పేర్కొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *