జగన్ పై మొదటి అస్త్రాన్ని సంధించనున్న చంద్రబాబు

ఏపీలో అధికారాన్ని చేపట్టినాక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. తన పాలన విషయాన్నీ పక్కన పెడితే జగన్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎక్కువగా ద్రుష్టి సారించాడని అర్థమవుతుంది. అందుకు నిదర్శనంగా చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టేసారు, దానితో ఆగకుండా చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూడా కూల్చేస్తామని నోటీసులు పంపించారు. అదీ కాక గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు కి ఉంటున్నటువంటి హై సెక్యూరిటీ ని కూడా జగన్ అధికారంలోకి వచ్చాక తొలగించాడు. ఎందుకు తన భద్రత తగ్గించారని అడగగా ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోగా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది అని చంద్రబాబు వాపోతున్నారు. అందుకు గాను చంద్రబాబు తనకు భద్రత తగ్గించిన విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే దూకుడుగా ప్రవర్తిస్తున్న జగన్ కి అడ్డుకట్టవేసి, ఏదోవిధంగా జగన్ సర్కార్ మీద నింద మోపి జనంలో సానుభూతి కొట్టేయాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే చంద్రబాబుకు కుదించిన భద్రత విషయంలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే దానికి సమాధానంగా బాబు భద్రత అన్నది ప్రమాణాలు, నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, పైగా ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నామని కూడా డీజీపీ చెబుతున్నారు.దాంతో టీడీపీ ఇపుడు మరో ఎత్తు వేసింది. ఏకంగా హై కోర్టు ని చంద్రబాబు ఆశ్రయించారు. తన భద్రత విషయంలో జగన్ సర్కార్ అనుసరించిన వైఖరిని అక్కడ తేల్చుకోవాలనుకుంటున్నారుట. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు గనక నెగ్గితే జగన్ కి మొదటి దెబ్బ పడ్డట్లే అని టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Tags: ys jagan vs chandra babu naidu, zcategory, security issue,ysrcp party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *