జగన్ కు ఓ విజన్ ఉంది, అది నాకు నచ్చింది: సినీ నిర్మాత పీవీపీ

జగన్ కు ఓ విజన్ ఉంది, అది నాకు నచ్చింది: సినీ నిర్మాత పీవీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఓ మంచి విజన్ ఉందని, అది తనకు నచ్చే ఆ పార్టీలో చేరానని సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త పీవీపీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఏ పని ఇచ్చినా చేసేందుకు సిద్ధమని అన్నారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని లేని సమయంలోనే తానెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు.

తనకు అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. టాలీవుడ్ కు అధిక ఆదాయం ఏపీ నుంచి వస్తుందన్న సంగతి ఓ నిర్మాతగా తనకు తెలుసునని, సినిమా షూటింగ్ లు ఎక్కడ తీసుకున్నా, పెద్ద సినిమాల ఫంక్షన్లు ఏపీలోనూ నిర్వహించేలా నిర్మాతలతో తాను చర్చిస్తానని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో తాను విజయవాడ నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానని, తనను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని పీవీపీ వ్యాఖ్యానించారు.
Tags: film producer pvp, join, ysrcp party, ys jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *