జగన్ కు అవగాహన లేదు, నేను చెబితే వినడు: చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి వల్ల రావాల్సిన పెట్టుబడులు రావడం లేదని, వచ్చిన పెట్టుబడులు సైతం వెనక్కు పోతున్నాయని, ఈ కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని విపక్ష నేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉదయం టీడీపీ వ్యూహ కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, పోలవరం పనులు ఆగిపోయాయని, అమరావతిలో పనులు ఒక్క అడుగు కూడా పడటం లేదని ఆరోపించారు. జగన్ కు అవగాహన లేదని, తాను చెప్పాలని చూస్తే వినడం లేదని అన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే పని అసెంబ్లీలో జరుగుతోందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పాడుతోందని అన్నారు. అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల వ్యక్తిత్వాన్ని కించబరిచేలా అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
Tags: Chandrababu,Tele Conference,Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *