చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్షే..! కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఇకపై ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఫలితంగా చిన్నారులపై లైంగిక నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీకి జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని ఉన్నాయి. దేశంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం ‘కార్మిక రక్షణ కోడ్‌’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కోడ్‌లోకి 13 కేంద్ర కార్మిక చట్టాలను తీసుకురానున్నారు. దీనివల్ల వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ తదితర రంగాల కార్మికులకు మేలు జరగనుంది. పదిమందికి మించి పనిచేసే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్ వర్తిస్తుంది. దీంతోపాటు ఆర్పీఎఫ్ సర్వీసులకు గ్రూప్-ఎ హోదా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Tags: Union Govt,Narendra Modi,Rape Girls, Pornography,Cabinet Meet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *