చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చింది.. వార్నింగ్ ఇచ్చేశాడుగా..!

చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చింది.. వార్నింగ్ ఇచ్చేశాడుగా..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి త‌న గురించి తానే బ‌డాయిలు ప‌లుకుతూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మ‌రోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన చంద్ర‌బాబు మాట్లాడు.. వ్యవస్థలను కాపాడుకోవడం, బాగు చేసుకోవడానికే తాను ప్రయత్నం చేస్తున్నానని.. త‌న పోరాటం దేశం కోసమే అని చంద్ర‌బాబు స్పష్టం చేశారు.

ఇక ఎన్నికల సంఘం పని కేవలం ఎన్నికలు నిర్వహించడమే అని, వారు ఆ పని చూసుకుంటే చాలని, తమ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొన్నారు. సీఎస్ కేవలం మూడు నెలలే ఉంటారని, కానీ తమ పార్టీ 22 ఏళ్లు అధికారంలో ఉందని, తాను ఎన్నో ఎన్నికలు చూశానని, కానీ ఇలాంటి ప‌రిస్థితు తాను ఎప్పుడూ ఎదుర్కోలేద‌ని చంద్ర‌బాబు అన్నారు.

అలాగే సీఈఓ కూడా సంవత్సరమే ఉంటారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించవద్దని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. కేవలం ఎన్నికల విధుల వరకే అధికారులు ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేయాలని, పరిపాలనకు సంబంధించిన అంశాల పై అధికారులు తనకే రిపోర్ట్ చేయాలని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. అలా చేయని వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇక అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటే మాత్రం సహించేది లేదని.. ఫాని తుఫాను ప్రభావాన్ని తమ టెక్నాలజీ ముందుగానే అంచనా వేసిందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని, మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నామ‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *