కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరాం

  • కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదు
  • ముందస్తు బెయిల్ కోసం శివరాం పిటిషన్
  • ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన కోర్టు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం ఈ రోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ముందస్తు బెయిల్ కోసం శివరాం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో… ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కాసేపట్లో ఆయన బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.

Tags: Kodela Son, Sivaram Krishna, Surrender , Narasaraopet court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *