కోడెల‌కు హ్యాండిచ్చిన సొంత పార్టీ నేత‌లు!

మాజీ స్పీకర్ కోడెల‌కు సొంత పార్టీ నేత‌లే హ్యాండిచ్చారా? ఆయ‌న ప్రాతినిధ్యాన్ని ఎంత‌మాత్రం స‌హించ‌లేక అత‌డు ఏర్పాటు చేయాల‌నుకున్న మీటింగ్ కి డుమ్మా కొట్టారా? అంటే టీడీపీ సాక్షిగా అవున‌నే వినిపిస్తోంది. ఇటీవ‌ల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ నేత‌ల్ని ఆహ్వానిస్తే మూకుమ్మ‌డిగా డుమ్మ కొట్ట‌డం పార్టీ ఇన్ సైడ్ అగ్గి రాజేసింద‌ట‌. అస‌లు ఈ స‌మావేశానికి ఎవ‌రూ రాకూడ‌ద‌ని ఆ మేరకు కార్యకర్తలు.. స్థానిక నాయ‌కులు కూడ‌బ‌లుక్కోవ‌డంతో దానిపై కోడెల గుర్రుమ‌న్నార‌ని తెలుస్తోంది.

ఓవైపు కోడెల‌పై వైకాపా అధినాయ‌కుడు.. సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ బృందం క‌క్ష క‌ట్టి ఎటాక్ షురూ చేస్తే మ‌రోవైపు పార్టీ కార్య‌క‌ర్త‌లే ఇలా కుట్ర చేయ‌డం ఏమీ బాలేద‌ని పెద్దాయ‌న వాపోయార‌ట‌. కోడెల సార‌థ్యంలోని పార్టీ సమావేశానికి నేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించుకోవ‌డంతో ఆయ‌న అవాక్క‌య్యార‌ట‌. ఇక ఆ స‌మావేశానికి తేదేపా నాయ‌కులు .. కార్య‌క‌ర్త‌లు డుమ్మా కొట్ట‌డానికి కార‌ణం అంతే క్లియ‌ర్ గా ఉంది. దీనికి కారణం సమావేశాన్ని అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలనుకోవడమేనని తెలుస్తోంది. కోడెల ఆఫీసులో సమావేశం ఏర్పాటుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మొన్న‌ సాయంత్రం నుంచి టీడీపీ పాత కార్యాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ సమావేశాన్ని అందులోనే జరపాలని డిమాండ్ చేశార‌ట‌… లేని పక్షంలో ఎవరూ రాకూడదని నిర్ణయించుకున్నార‌ని తెలిసింది. మొత్తానికి పార్టీలో కూడా కోడెల గౌర‌వం సున్నాకి ప‌డిపోయింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. దీనిని ఓ ర‌కంగా అవ‌మాన‌క‌రం అని పెద్దాయ‌న భావిస్తున్నార‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *