కేసీఆర్ పై వైఎస్ జగన్ చేసినట్టు తప్పుడు ట్వీట్!

కేసీఆర్ పై వైఎస్ జగన్ చేసినట్టు తప్పుడు ట్వీట్!

తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైన ఇంటర్ పరీక్షలు, వాటి ఫలితాల గురించి వైఎస్ జగన్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ పై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ పై జగన్ చేసినట్టుగా ఉన్న ఆ ట్వీట్ ను జగన్ చేయలేదని స్పష్టం చేసింది. ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంలో సీఎం కేసీఆర్ ను నిందించవద్దని జగన్ చేసినట్టుగా తప్పుడు ట్వీట్ ను ప్రచారం చేస్తున్నారని, ఈ ట్వీట్ ను తొలుత పెట్టిన వారిని గుర్తించి, న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నామని బుధవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో మీడియాకు తెలిపింది. దురుద్దేశంతోనే దీన్ని తయారు చేసి వైరల్ చేస్తున్నారని పార్టీ ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *