కేవలం 9 విమానాలకు పడిపోయిన జెట్... టికెట్ రద్దు చేసుకున్న వారికే రూ. 3 వేల కోట్ల బకాయి!

కేవలం 9 విమానాలకు పడిపోయిన జెట్… టికెట్ రద్దు చేసుకున్న వారికే రూ. 3 వేల కోట్ల బకాయి!

ఒకప్పుడు వందల సంఖ్యలో విమాన సర్వీసులను నడిపిస్తూ, వేల మందిని గమ్యస్థానాలకు చేర్చిన జెట్ ఎయిర్ వేస్, పరిస్థితి ఇప్పుడు మరింతగా దిగజారింది. గురువారం నాడు 14 విమానాలు నడిపిన సంస్థ, శుక్రవారం వచ్చేసరికి మరో 5 విమానాలను గ్రౌండింగ్ చేసి, 9 విమానాలకు పరిమితం అయింది. రెండు బోయింగ్ 737లను, మరో ఏడు ఏటీఆర్ విమానాలను మాత్రమే నేడు జెట్ నడిపిస్తోంది. ఇక జెట్ ఎయిర్ వేస్ సంస్థలో టికెట్లను బుక్ చేసుకున్న వారికి సొమ్ము వాపస్ కింద ఇవ్వాల్సిన మొత్తమే రూ. 3 వేల కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్, ఉద్యోగులకు మూడు నెలల వేతనాలను ఇవ్వాల్సివుంది. సంస్థ తాజా పరిస్థితిపై సమీక్షించి, రిపోర్టు ఇవ్వాలని విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. ఈ మేరకు విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సమీక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని, వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *