కాషాయం కండువా కప్పుకోనున్న టీడీపీ తెలంగాణ నేతలు

నేడు బీజేపీలో చేరనున్న పెద్దిరెడ్డి, సురేష్‌రెడ్డి, బోడ జనార్దన్‌
ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో కమలం గూటికి
వీరి బాటలోనే కాంగ్రెస్‌ నేత శశిధర్‌రెడ్డి కూడా?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ప్రముఖ నేతలు ఈరోజు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి ప్రయాణమైన వీరు పార్టీ చీఫ్‌ అమిత్‌షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. టీడీపీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్దన్‌లు బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని ఆ పార్టీ నేతలతో కొన్నాళ్లుగా సంప్రదిస్తున్నారు. అటు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీలో వీరి చేరిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కూడా గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. వీరితోపాటు మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత శశిధర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చేనెల రెండోవారంలో టీడీపీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *