కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం.. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన పదిహేను మంది అసంతృప్త ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్ కుమటహళ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్.శంకర్ లను అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మిగిలిన రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
Tags: Karnataka, Congress, Jds Speaker Ramesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *