కంచుకోటలో తగ్గిన టీఆర్ఎస్ హవా... జీవన్ రెడ్డి ఘనవిజయం!

కంచుకోటలో తగ్గిన టీఆర్ఎస్ హవా… జీవన్ రెడ్డి ఘనవిజయం!

39,430 ఓట్ల మెజారిటీతో విజయం
పోలైన ఓట్లు 1,15,458
తొలి ప్రాధాన్యతా ఓటుతోనే జీవన్ రెడ్డి విజయం
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పట్టభద్రులు ఇప్పుడా పార్టీని కాదన్నారు. ఈ నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రెండో స్థానానికి పరిమితమయ్యారు. గ్రూప్ – 1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై జీవన్ రెడ్డి 39,430 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1,15,458 ఓట్లు పోల్ కాగా, చంద్రశేఖర్ గౌడ్ కు 17,268 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు మూడో స్థానంలో నిలిచి 15,077 ఓట్లను పొందారు. 9,932 ఓట్లు చెల్లలేదని కౌంటింగ్ అధికారులు వెల్లడించారు. తొలి ప్రాధాన్యతా ఓటుతోనే జీవన్ రెడ్డి విజయం సాధించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *