‘ఓ బేబీ’ నుంచి ఆకట్టుకునే పాట

సమంత ప్రధాన పాత్రధారిగా ‘ఓ బేబీ’
సంగీత దర్శకుడిగా మిక్కీ.జె మేయర్
జూలై 5వ తేదీన విడుదల
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘ఓ బేబీ’ రూపొందింది. సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కీలమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

“మహా అద్భుతం కదా .. అదే జీవితం కదా .. ” అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ. జె మేయర్ సంగీతం .. భాస్కర భట్ల సాహిత్యం .. నూతన మోహన్ ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. జీవిత సత్యాలని ఈ పాట ద్వారా ఒక పాఠంగా చెప్పడానికి భాస్కర భట్ల చాలా సరళమైన పదాలను ఉంపయోగించాడు. ‘తీపి కావాలంటే చేదు మింగాలంతే .. కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా’ అనే వరసలు బాగున్నాయి. నాయికను ముందుకు నడిపించే నేపథ్యంలో వచ్చే ఈ పాటను నూతన మోహన్ బాగా పాడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *