ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాలేదు అయినా రోజుకొక సంచలన నిర్ణయం తీసుకుంటూ సీనియర్ రాజకీయనేతలతోనే శభాస్ సీఎం సార్ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చెబుతూ, తన ప్రభుత్వంలో అవినీతికి తావు ఇవ్వబోనని మాట ఇచ్చాడు.

అయితే ఏపీ సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే గత తొమ్మిది సంవత్సరాల జగన్ రాజకీయ ప్రస్థానంలో పూర్తిగా ప్రజలతోనే గడుపుతూ పాదయాత్రలు చేసి వారికి నేనున్నానంటూ ధైర్యాన్ని అందించాడు. అయియ్తే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించేవారు. అయితే మళ్ళీ అదే కార్యక్రమాన్ని జగన్ చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. జూలై 1వ తేదీ నుంచి ప్రతీ రోజు ఉదయం గంట సేపు తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజలతో భేటీ అయ్యి తానే స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కారించాలని డిసైడ్ అయ్యాడు. అయితే కష్టం అంటూ వచ్చిన ప్రతి ఒక్కడికి సాయం చేయాలని ప్రజాదర్భార్‌ను ప్రజల సమస్యల పరిష్కార వేదికగా మార్చి ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రజ దర్బార్ కోసం సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజలు వేచి ఉండేందుకు ఒక పెద్ద షెడ్డు వంటి నిర్మాణాన్ని నిర్మించి అక్కడ త్రాగు నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *