ఏపీ పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

ఇక ఏపీలో మరో అంకానికి రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఏప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఏన్నికలకు రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో జరిగే గ్రామ స్థాయి ఏన్నికలు రాబోతున్నాయి.ఇక హైకోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారీటి ఇచ్చింది.రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు స్పష్టం చేశారు.

అయితే, ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85ు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

బీసీలకు 34ు, ఎస్సీలకు 19.08ు, ఎస్టీలకు 6.77ు కోటా ఉంటుందని చెప్పారు. ఇక ఇప్పుడు ప్రతి పక్షాలు కూడా ఏన్నికలకు సిధ్ధం అవుతాయి అనడంలో ఏటువంటీ సందేహం లెదు. ఇక ప్రభుత్వం పై ప్రజలు వ్యతిరేకంగా వున్నారు అని చెప్పడానికి వీలుంటుంది అని ఇప్పుడు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

Tags: panchayat, elections, november 18th, AP panchayath elections 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *