ఏపీ నూతన అసెంబ్లీ ప్రత్యేకతలు... జాతీయ పార్టీల ప్రాతినిధ్యంలేని తొలి సభ!

ఏపీ నూతన అసెంబ్లీ ప్రత్యేకతలు… జాతీయ పార్టీల ప్రాతినిధ్యంలేని తొలి సభ!

మూడు దశాబ్దాల కాలంలో కొత్త సభ్యులు అధికం
25 మంది మంత్రుల్లో 19 మంది కొత్తవారు
యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం
నవ్యాంధ్ర రెండో శాసన సభ ఎన్నో ప్రత్యేకతలతో ఈరోజు కొలువుదీరబోతోంది. జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యంలేకపోవడం ఈసారి ప్రత్యేకత. ఈ రోజు ఉదయం 11.05 గంటలకు కొత్త సభ కొలువుదీరనున్న విషయం తెలిసిందే. మొత్తం 175 మంది సభ్యులున్న సభలో అత్యధిక శాతం కొత్తవారే కావడం విశేషం. గడచిన 30 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటువంటి రికార్డు లేదు.

అలాగే మొత్తం 25 మంది మంత్రుల్లో 19 మంది కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు. రాష్ట్ర చరిత్రలో 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు ఒక పార్టీకి దక్కడం కూడా ఇదే మొదటిసారి. ఇక అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు ఒక్క స్థానం కూడా దక్కకపోవడం. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా బీజేపీ సభ్యులు కొందరు గెలిచి ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఈసారి ఆ పార్టీకి కూడా ఒక్క స్థానం దక్కకపోవడంతో జాతీయ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఒక సభ్యుడి ప్రాతినిధ్యం లభించింది.
Tags: AP assembly 2019, ysrcp mla, ap govt, cm jagan mohan reddy, udayabhanu, rayadurg mla rama chandrareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *