ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతస్థాయి పదవుల్లో అధికారులకు స్థానచలనం తప్పలేదు. ఇప్పుడు మరింత భారీస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీకి తెరలేపారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. పాలనపై తనదైన ముద్రవేసే ప్రయత్నాల్లో భాగంగా సీఎం జగన్ అధికారుల స్థానచలనానికి పచ్చజెండా ఊపారు. ఇప్పటికే పలు కీలకపోస్టుల్లో అనుకూల అధికారులను తీసుకువచ్చిన జగన్, ఇప్పుడు కీలక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల బదిలీలపై దృష్టిసారించారు.

ఈ క్రమంలో సీనియర్ అధికార్లు కొత్త బాధ్యతల్లోకి వెళుతున్నారు. పీయూష్ కుమార్ కు వాణిజ్యపన్నుల శాఖ, క్రాంతిలాల్ దండేకి ఇంటర్ బోర్డు కమిషనర్ గా బాధ్యతలు కేటాయించారు. అంతేకాకుండా, ప్రకాశం జిల్లాకు పి. భాస్కర్, గుంటూరు జిల్లాకు శామ్యూల్ ఆనంద్, చిత్తూరు జిల్లాకు నారాయణ్ భరత్ గుప్తా కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

​ అధికారి పేరు – బదిలీ అయిన స్థానం

గౌతమ్ సవాంగ్ – డీజీపీ, రహదారుల భద్రత సంస్థ చైర్మన్
విజయ్ కుమార్ – పురపాలక శాఖ కమిషనర్
గిరిజాశంకర్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
పీయూష్ కుమార్ – వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్
క్రాంతిలాల్ దండే – ఇంటర్ బోర్డు కమిషనర్
ప్రద్యుమ్న – మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
హర్షవర్ధన్ – సాంఘిక సంక్షేమశాఖ డైరక్టర్
జె.మురళి – ముఖ్యమంత్రి ఓఎస్డీ
పి.సీతారామాంజనేయులు – రవాణా శాఖ కమిషనర్
లక్ష్మీనృసింహం- సీఆర్ డీఏ కమిషనర్
కాటమనేని భాస్కర్ – టూరిజం, యువజన, సాంసృతిక శాఖ ఎండీ
ఎంఎం నాయక్ – ఎక్సైజ్ శాఖ కమిషనర్
ప్రవీణ్ కుమార్ – వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్లెక్టర్
కాశిరెడ్డి వీఆర్ఎన్ రెడ్డి – డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
కేఆర్ఎం కిశోర్ కుమార్ – హోంశాఖ ముఖ్యకార్యదర్శి
కోన శశిధర్ – పౌరసరఫరాల శాఖ కమిషనర్
బి.శ్రీధర్ – ఏపీ జెన్ కో ఎండీ
నాగులాపల్లి శ్రీకాంత్ – ఏపీ ట్రాన్స్ కో ఎండీ
ముఖేశ్ కుమార్ మీనా – సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
ఎంటీ కృష్ణబాబు – రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి
కె.దమయంతి – మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
విజయానంద్ – జీఏడీకి రిపోర్టు చేయాలంటూ ఆదేశం
బి.రాజశేఖర్ – పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
అజయ్ జైన్ – జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
ఆర్సీ సిసోడియా – సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి
అనంతరాము – గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి
కేఎస్ జవహర్ రెడ్డి – వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
జేఎస్వీ ప్రసాద్ – ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్ – జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నీరబ్ కుమార్ – అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పూనం మాలకొండయ్య – వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల వలవన్ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ – పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ముఖ్యకార్యదర్శి
చిరంజీవి చౌదరి- ఉద్యాన శాఖ కమిషనర్
జిల్లా కలెక్టర్లు

డి.మురళీధర్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
నారాయణ్ భరత్ గుప్తా – చిత్తూరు జిల్లా కలెక్టర్
వీరపాండ్యన్ – కర్నూలు జిల్లా
ముత్యాలరాజు – పశ్చిమ గోదావరి జిల్లా
ఎస్.సత్యనారాయణ – అనంతపురం జిల్లా కలెక్టర్
ఎంవీ శేషగిరిబాబు – నెల్లూరు జిల్లా కలెక్టర్
వినయ్ చంద్ – విశాఖ జిల్లా కలెక్టర్
పి.భాస్కర్ – ప్రకాశం జిల్లా
శామ్యూల్ ఆనంద్ – గుంటూరు జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *