ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్.. తేదీ ఖరారు చేసిన ఈసీ

ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్.. తేదీ ఖరారు చేసిన ఈసీ

ఈ నెల 6న రీపోలింగ్
రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు
ఏర్పాట్లు చేస్తున్నామన్న గోపాలకృష్ణ ద్వివేది
గత నెల 11న ఏపీలో జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు తేదీ ఖరారు చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244వ బూత్‌, నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలో ఇసుకపల్లి 41వ బూత్‌, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్‌, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించిన ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నెల ఆరో తేదీన ఆయా పోలింగ్ బూత్‌‌లలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *