ఈ బికినీ సెన్సార్ కు కనిపించలేదా!

టాలీవుడ్ ప్రేక్షకులకు దాదాపు బికిని చూసే అదృష్టం లేదనే చెప్పాలి. పొరపాటున ఎక్కడైనా బికినీ కనిపిస్తే దాన్ని బ్లర్ చేసే వరకు ఊరుకోరు సెన్సార్ అధికారులు. వీళ్లకి బికినీ అంటే బ్లర్ అని అర్థం. ఇంత కఠినంగా ఉండే సెన్సార్ అధికారులు, కొన్ని బికినీల విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఊరుకుంటారు.

గౌతమ్ నంద సినిమానే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాలో క్యాథరీన్ త్రెసా బికినీలో కనిపిస్తుంది. వెండితెరపై ఎలాంటి బ్లర్స్ లేకుండా ఆ బికినీ సీన్ బ్రహ్మాండంగా కనిపించింది. ఇది చాలదన్నట్టు ఆ సన్నివేశంలో బికినీ వేసుకున్న క్యాథరీన్ ను రకరకాల యాంగిల్స్ లో చూపించారు. మరిన్ని అందాలు కనిపించాలనే ఉద్దేశంతో ఒక దగ్గర ఆమెను బెండ్ చేసి మరీ చూపించారు.

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే డీజే సినిమాలో కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే గౌతమ్ నంద సినిమాలో కనిపించినంత హాట్ నెస్ డీజేలో ఉండదు కూడా. అయినప్పటికీ సెన్సార్ దాన్ని బ్లర్ చేసింది. ఇదే కాదు.. గతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో బికినీ సీన్లపై తెల్లరంగు పూసింది. కానీ గౌతమ్ నందలో హాట్ సన్నివేశాన్ని మాత్రం సెన్సారోళ్లు ఎందుకు వదిలేశారో వాళ్లకే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *